Customised Vedic Jyotish Reports

Premium Reports

Vedic Astrology Reports

రాశులపై శని యొక్క ప్రభావము (Saturn's influence in Different Zodiac Signs)


కొన్ని గ్రహములతో పాటు శని భగవానుడు లాభకారిగా వుండును మరి కొన్ని వాటితో అశుభ కారిగా వుండును. అదేవిధముగా 12 రాశులలో కొన్నిటిలో శని లాభదాయకుడిగా వుండిన మరి కొన్ని వాటిలో హానికారిగా వుండును. మీ కుండలిలో శని ఏ రాశిలో వున్నాడు మరియు ఇది మీకు ఎలాంటి ప్రభావములను ఇచ్చునో చూద్దాము రండి.

మేషరాశిలో శని: (Satun in Aries)
రాశి చక్రములో అన్నిటి కన్నా ముందు స్థానములో మేష రాశి వున్నది. ఈ రాశిలో శని నీచ(Saturn is debilitated in Aries)లో వుండును. శని నీచ పెట్టి వుండుట వలన ఇది అశుభ కారిగా వుండును. ఈ రాశిలో శని యొక్క స్థితి వ్యక్తిలో ఆత్మ విశ్వాసములో లోపము ఎదురుకాగలదు. ఈ రాశిలో ఎవరికైతే శని వుండునో వారు మొండి స్వబావము మరియు కోపము గలవారై వుండెదరు. ఇది వ్యక్తిని చెడు అలవాట్లకు బానిసలుగా చేయును. మేష రాశిలో శని యొక్క మహాదశ(Sahni mahadasha in Aries)జరుగు తున్న సమయములో బందు మిత్రులతో విరోధములు ఉత్పన్నము కాగలవు. ఈ సమయములో సంబందముల మద్య దూరము కూడా పెంపొందగలదు.

వృషభ రాశిలో శని: (Saturn in Taurus)
వృషభ రాశి రాశి చక్రములో రెండవ రాశి(Taurus is the 2nd sign). ఏ వ్యక్తి యొక్క కుండలిలో శని ఈ రాశిలో స్థితిలో వున్నాడో ఆ వ్యక్తి ఉత్సుక మాటలు మాట్లాడే వ్యక్తిగా వుండును. జ్యోతిష్య శాస్త్ర అనుసారముగా ఇటు వంటి వ్యక్తులు విశ్వాస పాత్రులు కాజాలరు. వీరు స్వార్ధము కొరకు ఎవరికైనా నమ్మక ద్రోహము చేయవచ్చును. చాలా తెలివి మరియు శక్తి కలవారై వుండెదరు. పనిచేయవలననే కోరిక వీరిలో అధికముగా వుండును. యది కుండలిలో అన్య శుభ గ్రహముల స్థితి లేని ఎడల వీరికి అనేక స్త్రీ మరియు పురుషులతో సంబందములు వుండగలవు.

మిధున రాశిలో శని: (Saturn in Gemini)
మూడవ రాశి మిధున రాశి. ఈ రాశిలో శని వుండుట వలన వ్యక్తి దుశ్శాహసి కాగలడు. వ్యక్తి చతురత మరియు దుర్ర్ధ్వ ప్రకృతి కలవాడై వుండును. రాజనీతి మరియు కూటనీతి రంగములలో వారికి విషేశ సఫలత లభించగలదు. వీరిలో దయ మరియు సమ్మానించు లోపములు వుండును. సంతానము యొక్క దృష్టి నుండి ఇది అంత ఉత్తమముగా వుండదు. అనగా ఇది అల్ప సంతాన యోగము యొక్క నిర్మాణము చేయుచున్నది. సాహిత్యము, సంగీతము మరియు సౌదర్యముపై వ్యక్తికి విషేశకరమైన ఆసక్తి కలిగి వుండును.

కటక రాశిలో శని: (Saturn in Cancer)
రాశి చక్రములో చతుర్ధ రాశి కటక రాశి. ఏ వ్యక్తి యొక్క కుండలిలో చతుర్ధ బావములో శని వుండునో ఆ వ్యక్తి మొరటి స్వభావము కలిగి ఇతరులపై ఈర్శా స్వభావము కలవాడై వుండగలడు. స్వార్ధ తనము వీరిలో అధికముగా వుండును. మాతృ పక్షము నుండి వీరికి సుఖము తక్కువగా లభించగలదు. యది శని యొక్క మహాదశ కటక రాశిలో వున్న సమయములో వీరికి విషేశ కరమైన కష్టములు కలుగును. శని యొక్క మహాదశలో వీరికి కుటుంబ జీవనములో వొడిదుడుకులు, మానసిక అశాంతి, అస్థవస్థతలో వుండెదరు.

సింహ రాశిలో శని: (Saturn in Leo)
సింహ రాశి రాశి చక్రములో పంచమ రాశి. ఈ రాశిలో శని వుండుట కారణముగా శని వ్యక్తిని గంభీర స్వబావము మరియు చింతతో కలిగి వుంచును. వ్యక్తి కార్య నిపుణత మరియు పరిశ్రమించే వ్యక్తి కాగలరు. ఈ రాశిలో శని ప్రభావము గల వ్యక్తి వారి మాటపై మొరడు పట్టే వారుగ వుండెదరు. గోచారములో ఈ రాశిలో శని యొక్క మహాదశ వున్న సమయములో వీరికి అత్యంత పరిశ్రమ చేయవలసి వుండును. అనవసరముగా ధన హాని కలుగును మరియు మనస్సులో నిరాశాత్మక విచారములు కలుగగలవు.

కన్యా రాశిలో శని: (Saturn in Virgo)
ఎవరి కుండలిలో అయితే కన్యా రాశిలో శని (Shani in Virgo Rashi) వుండిన ఎడల వారు పరోపకారి మరియు గుణవంతులు కాగలరు. ఈ రాశిలో ఎవరికైతే శని వుండునో వారు ధనవంతులు మరియు శక్తి శాలి కాగలరు. తక్కువగా మాట్లాడే వారు మరియు రచయిత మరియు గంభీరమైన విషయములపై ఆసక్తి కలవారై వుండేదరు. వీరు సామాజిక కార్య కలాపములలో ఆసక్తి కలిగి వుండెదరు. రీతులను, పాత పద్దతులను ఆచరించి వాటిపై నమ్మకము కలిగి వుండెదరు. ఈ రాశిలో శని యొక్క మహాదశ సమయములో వీరికి పేరుప్రఖ్యాతులు మరియు లాభములు లభించగలవు.

తులా రాశిలో శని: (Saturn in Libra)
తులా రాశిలో ఎవరికైతే శని(Saturn in Libra) వుండునో వారికి శని ఉత్తమ ఫలితమును ఇచ్చు వాడగును. ఈ వ్యక్తికి స్వాభిమానము, మహత్వాకాంక్షి మరియు వాక్వత్త్వ కలలో నిపుణుతను పొందగలరు. ఇది వ్యక్తికి స్వతంత్ర విచారము గల మరియు చాతుర్యము గల వ్యక్తిగా చేయును. రూపము కన్నా బలమైన మరియు మంచి మానసిక క్షమతను ప్రదానించును.

వృశ్చిక రాశిలో శని: (Saturn in Scorpio)
శని భగవానుడు కుండలిలో వృశ్చిక రాశిలో వుండిన ఎడల ఆ వ్యక్తి ఉత్తేజము మరియు క్రోదము కలవారై వుండెదరు. వీరిలో అభిమానము మరియు వైరాగ్యము యొక్క భావనము వుండును. వీరు గంభీర స్వభావము కలిగి ఈర్ష కలవారై వుండెదరు. ఈ రాశిలో శని యొక్క మహాదశ వున్నప్పుడు వీరి ఆర్ధిక స్థితి మరియు మాన సమ్మానమునకు హానికలుగ వచ్చును.

ధను రాశిలో శని: (Saturn in Sagitarius)
రాశి చక్రములో శని నవమ స్థానములో వున్నది. ఈ రాశిలో శని(Shani in Dhanu Rashi) వుండుట వలన వ్యక్తిని వ్యావహారికముగాను మరియు బుద్దిమంతునిగాను చేయగలరు. వ్యక్తి పరిశ్రమి మరియు మంచి విచారములు కలవాడై వుండెదరు. తెలివిగా బుద్దిని ఉపయోగించి పనిచేయువారై వుండెదరు. ఈ రాశిలో శని యొక్క మహాదశ కలుగుతున్నప్పుడు, ఆ సమయములో వ్యక్తికి సుఖమైన మరియు ఉత్తామ ఫలితములు ప్రాప్తించగలవు. శిక్ష యొక్క క్షేత్రములో మహాదశలో సఫలత లభించగలదు.

మఖర రాశిలో శని: (Saturn in Capricorn)
రాశి చక్రములోని దశమ రాశి అనగా మఖర రాశిలో వ్యక్తికి పరిశ్రమి మరియు ఈశ్వరుని పట్ల నమ్మకము కలిగి వుండును. వ్యాపారములో ప్రగతి, ఆర్ధిక లాభము, ఆస్థిపాస్తులలో లాభము శని సమకూర్చును. శని వీరిని ప్రకృతిని ఆఘ్లాదించు వ్యక్తిగా చేయును. పేరాశ మరియు స్వార్ధము వీరి మనస్సులో వుండగలదు.

కుంభరాశిలో శని: (Saturn in Aquarius)
ఎవరి కుండలిలో శని దశమ బావములో అనగా కుంభరాశిలో వున్నదో ఆ వ్యక్తి అహంకారము కలవాడై వుండును. ఆర్ధిక పరముగా సామాన్య స్థితి వుండును. కూటనీతి రంగములో సపలతతో బుద్ధికలిగి వుండెదరు. నేత్రరోగముతో బాధించబడగలరు. వ్యవహార కుశలత మరియు భాగ్యము వలన ధనము కలవారై వుండెదరు.

మీన రాశిలో శని: (Saturn in Pisces)
రాశి చక్రములో 12వ రాశి మీనరాశి. ఈ రాశిలో శని (Shani in Meen Rashi) స్థితిలో వున్నప్పుడు వ్యక్తిని గంబీరముగా చేయును. వ్యక్తి ఇతరులపై ఈర్ష కలిగి వుండెదరు. లేదా పేరాశ కలవారై వుండెదరు. ఈ రాశిలో శని వుండుట కారణముగా వ్యక్తి ఉదార స్వభావము కలిగి సమాజములో ప్రతిష్ట కలిగిన వారై వుండెదరు. వీరి ఆర్ధిక స్థితిని సామాన్యగా వుంచును.

ఈ ప్రకారముగా శని విభిన్న రాశులలో ఫలితములను మరియు ప్రభావములను ఇచ్చును.
Article Categories: saturn
Article Tags:


Comment(s) on this article


  1. ramprasad said on Oct 21, 2011 01:30 AM
    this is very very nice next month i want to take remain particulars clearly by payment
  2. D.Ramamoorthy said on Jul 26, 2013 09:34 AM
    my lucky stone,number,colour
  3. c srinivasareddy said on Aug 22, 2013 06:45 PM
    31 03 1967 7 25 am

Leave Your Comment


Name
Email
Website
Comment
bottom
Free Vedic Jyotish

Free Reports

Free Vedic Astrology

All content on this site is copyrighted.


Do not copy any content without permission. Violations will attract strict legal penalties.